బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 01, 2020 , 12:42:18

అవినీతి సీఎం ముందు మోక‌రిల్ల‌డం ఎందుకు?: ‌చిరాగ్ పాశ్వాన్

అవినీతి సీఎం ముందు మోక‌రిల్ల‌డం ఎందుకు?: ‌చిరాగ్ పాశ్వాన్

ప‌ట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా కొన‌సాగుతున్న‌ది. వివిధ పార్టీల నేత‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఈ ఎన్నిక‌ల్లో అధికార జేడీయూ-బీజేపీ, ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూట‌ములుగా బరిలో నిలిచాయి. ఈ క్ర‌మంలో బీజేపీ నేత‌లు సీఎం నితీశ్ కుమార్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుండ‌టంపై ఎల్‌జేపీ అధ్య‌క్షుడు చిరాగ్ పాశ్వాన్ విమ‌ర్శ‌లు గుప్పించారు. అవినీతిప‌రుడైన ముఖ్య‌మంత్రి (సీఎం నితీశ్ కుమార్‌ను ఉద్దేశించి) ముందు బీజేపీ నేత‌లు ఎందుకు మోక‌రిల్లుతున్నార‌ని చిరాగ్‌ ప్ర‌శ్నించారు. 

సీఎంను ప్ర‌శంసిస్తూ బీజేపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లను, ఓట‌ర్ల‌ను నిరుత్సాహప‌రుస్తున్నాయ‌ని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. అయినా, ఈ ఎన్నిక‌ల్లో అత‌ను గెలిచే అవకాశం లేద‌నే సంగ‌తి అత‌నికి ముందే తెలుస‌ని చిరాగ్ చెప్పారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా శ‌నివారం బీజేపీ అధ్య‌క్షుడు న‌డ్డా మాట్లాడుతూ.. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి జేడీయూ కంటే ఎక్కువ సీట్లు వ‌చ్చినా ముఖ్య‌మంత్రి అయ్యేది నితీశేన‌ని ప్ర‌క‌టించ‌డంపై చిరాగ్ ఈ విధంగా స్పందించారు.       ‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.