సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 10:49:54

సీఎం అభ్య‌ర్థ‌నను రెండ‌వ సారి తిర‌స్క‌రించిన గ‌వ‌ర్న‌ర్‌

సీఎం అభ్య‌ర్థ‌నను రెండ‌వ సారి తిర‌స్క‌రించిన గ‌వ‌ర్న‌ర్‌

హైద‌రాబాద్‌: అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ రెండ‌వ సారి పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ క‌ల్‌రాజ్ మిశ్రా తిర‌స్క‌రించారు. శుక్ర‌వారం రోజున కూడా ఇలాంటి అభ్య‌ర్థ‌న‌నే ఆయ‌న తిప్పిపంపారు. అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించాల‌నుకుంట‌న్న త‌మ ప్ర‌య‌త్నాల‌ను బీజేపీ వ‌త్తిడి వ‌ల్ల గ‌వ‌ర్న‌ర్ అడ్డుకుంటున్నార‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మ‌రోవైపు ఇశాళ సుప్రీంకోర్టులో అన‌ర్హ‌త పిటిష‌న్‌పై తీర్పు వెలుబ‌డ‌నున్న‌ది. స‌చిన్ పైల‌ట్‌తో పాటు మ‌రో 18 మంది ఎమ్మెల్యేల‌కు అన‌ర్హ‌త నోటీసులు జారీ చేసిన స్పీక‌ర్ ఆ కేసులో సుప్రీంను ఆశ్ర‌యించారు.

సోమ‌వారం నుంచి అసెంబ్లీ నిర్వ‌హిస్తామ‌ని గ‌త శుక్ర‌వారం గెహ్లాట్ గ‌వ‌ర్న‌ర్‌కు లేఖ రాశారు. రాజ్‌నివాస్‌లో దాదాపు అయిదు గంట‌ల పాటు ధర్నా కూడా చేప‌ట్టారు. ప్ర‌త్యేక సెష‌న్‌లో క‌రోనా వైర‌స్‌తో పాటు ఆర్థిక వ్య‌వ‌స్థ అంశాన్ని చ‌ర్చిస్తామ‌ని గెహ్లాట్ చెప్పినా.. గ‌వ‌ర్న‌ర్ మాత్రం అంగీక‌రించ‌లేదు. గెహ్లాట్ ప్ర‌భుత్వం నుంచి పైల‌ట్ బృందం వైదొల‌గ‌డంతో రాజ‌స్థాన్‌లో రాజ‌కీయ ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న‌ది. అయితే సుప్రీంకోర్టులో వేసిన పిటిష‌న్‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. 

 

 logo