ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 03:05:30

కరోనా కోసమే సభ

కరోనా కోసమే సభ

  • బలపరీక్ష ప్రస్తావనలేని క్యాబినెట్‌ నోట్‌
  • రాజస్థాన్‌లో రసవత్తరంగా రాజకీయం 
  • న్యాయ పోరాటంపై కాంగ్రెస్‌లో విభేదాలు

జైపూర్‌: రాజస్థాన్‌ రాజకీయం మరో మలుపు తిరిగింది. బలపరీక్ష కోసం అసెంబ్లీని సమావేశపర్చాలని గవర్నర్‌తో పేచీకి దిగిన సీఎం గెహ్లాట్‌, తీరా క్యాబినెట్‌ తీర్మానంలో ఆ అంశాన్నే ప్రస్తావించలేదు. శనివారం భేటీ ఆయిన క్యాబినెట్‌ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని చర్చించేందుకు అసెంబ్లీని ఈ నెల 31నుంచి ప్రత్యేకంగా సమావేశపర్చాలని గవర్నర్‌ను కోరింది. సభలో బలమున్నప్పుడు బల పరీక్ష ఎందుకని గవర్నర్‌ కల్‌రాజ్‌మిశ్రా అడగడంతో సీఎం వ్యూహం మార్చినట్టు సమాచారం. మరోవైపు గవర్నర్‌పై కాంగ్రెస్‌ నేత అభిశేక్‌ సింఘ్వీ విమర్శల వర్షం కురిపించారు. గవర్నర్లు రాష్ట్రప్రభుత్వాల సలహామేరకు నడుచుకోవాలని, కానీ కల్‌రాజ్‌ మిశ్రా మాత్రం కేంద్ర ంలోని ఆయన మాస్టర్లు ఆడించినట్టు ఆడుతున్నారని ఆరోపించారు. కాగా, రాష్ట్రం లో భద్ర తా పరిస్థితులపై పోలీసు ఉన్నతాధికారులతో గవర్నర్‌ ఆదివారం సమీక్ష నిర్వహించారు.

రాజకీయ పోరాటమే మేలు

రాజస్థాన్‌ సంక్షోభంపై న్యాయపోరాటం కంటే రాజకీయ పోరాటమే ఉత్తమమని కాంగ్రెస్‌లోని పలువురు సీనియర్లు వాదిస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పోరాడటంకంటే ప్రజల్లోకి వెళ్లి బీజేపీ తప్పులను ఎండగట్టడమే మంచిదని అధిష్ఠానానికి చెప్తున్నట్టు వార్తలు వచ్చాయి. బీజేపీకి వ్యతిరేకంగా ‘స్పీక్‌ అప్‌ ఫర్‌ డెమోక్రసీ’ పేరుతో కాంగ్రెస్‌ ఆదివారం డిజిటల్‌ ప్రచారం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా, ఒక వేళ అసెంబ్లీలో బలపరీక్ష జరిగితే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బీఎస్పీ తన ఆరుగురు ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసింది.


logo