ఆదివారం 24 జనవరి 2021
National - Dec 23, 2020 , 13:47:10

పీఎం ఆడిచ్చిన‌ట్ట‌ల్లా సీఎం ఆడుతున్నాడు: ఎంకే స్టాలిన్‌

పీఎం ఆడిచ్చిన‌ట్ట‌ల్లా సీఎం ఆడుతున్నాడు: ఎంకే స్టాలిన్‌

న్యూఢిల్లీ: రైతులు నెల రోజుల నుంచి ఆందోళ‌న చేస్తున్నా కేంద్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని త‌మిళ‌నాడు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ మండిప‌డ్డారు. ఈ ఉద‌యం కాంచిపురంలో నిర్వ‌హించిన ఓ స‌మావేశంలో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడిన ఆయ‌న‌.. వివిధ రాష్ట్రాల రైతులు ఢిల్లీకి వెళ్లి ఎముక‌లు కొరికే చ‌లిలో ఉద్య‌మిస్తున్నార‌ని, అయినా వారి స‌మ‌స్య ప‌రిష్కారానికి కేంద్రం ముందుకు రాక‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు.

నెల రోజులుగా రైతులు ఉద్య‌మిస్తున్నా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వారి మొర వినేందుకు ముందుకు రాలేద‌ని, వారితో మాట్లాడే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని స్టాలిన్ విమ‌ర్శించారు. మ‌న‌ ముఖ్య‌మంత్రి ఎడ‌ప్ప‌డి ప‌ళ‌నిస్వామి కూడా ప్ర‌ధాని ఆడిచ్చిన‌ట్ట‌ల్లా ఆడుతున్నాడ‌ని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మంత్రుల అవినీతికి సంబంధించి తాము గ‌వ‌ర్న‌ర్‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించామ‌ని, గ‌వ‌ర్న‌ర్ త‌మ ఫిర్యాదు మేర‌కు ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే కోర్టుకు వెళ్తామ‌ని స్టాలిన్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

నేటి నుంచి క‌ర్ణాట‌క‌లో రాత్రి క‌ర్ఫ్యూ

రాహుల్‌గాంధీకి ఆలుగ‌డ్డ ఎట్ల పెరుగుత‌దో తెలియ‌దు

రైతు ఆందోళ‌న‌ల‌కు కేర‌ళ మ‌ద్ద‌తు : సీఎం విజ‌య‌న్‌

రైతులు ఉద్యమాన్ని ఉపసంహరిస్తారని భావిస్తున్న : రాజ్‌నాథ్‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.       
logo