సోమవారం 18 జనవరి 2021
National - Nov 27, 2020 , 19:05:26

అంగదాత స్మారక్‌ను ప్రారంభించిన సీఎం అశోక్‌ గెహ్లోత్‌

  అంగదాత స్మారక్‌ను ప్రారంభించిన సీఎం అశోక్‌ గెహ్లోత్‌

జైపూర్‌: భారతదేశపు అవయవదాన దినోత్సవాన్నిపురస్కరించుకుని రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ శుక్రవారం "అంగదాత స్మారక్‌"ను జైపూర్ లో ప్రారంభించారు. దేశంలో అవయవదాతల కోసం ప్రారంభించిన మొట్టమొదటి స్మారక చిహ్నం ఇది.ఈ మెమోరియల్‌ను ఆరంభించడంతో పాటుగా నేపథ్యీకరణను మోహన్‌ఫౌండేషన్‌ జైపూర్‌ సిటిజన్‌ ఫోరమ్‌ నవ్‌జీవన్‌ (ఎంజెసీఎఫ్‌ నవ్‌జీవన్‌) చేయడంతో పాటుగా తమ అవయవాలను మరొకరికి వెలుగునందించడానికి, దానం చేయడానికి కట్టుబడిన అసంఖ్యాక వ్యక్తులకు నివాళలర్పిస్తుంది.

సుప్రసిద్ధ జైపూర్‌ డిజైనర్‌ సమీర్‌ వీటన్‌ డిజైన్‌ చేసిన స్మారకాన్నిదాల్మియా భారత్‌ సిమెంట్‌ డిజైనింగ్‌ అండ్ క్రియేటివిటీ విభాగం క్రాఫ్ట్‌ బీటన్‌ దీనిని నిర్మించింది. ఈ మెమోరియల్‌ను ఎస్‌ఎంఎస్‌ ఆస్పత్రి దగ్గరలోని పృథ్వీరాజ్‌ రోడ్‌, టోంక్‌ రోడ్‌ కూడలి వద్ద నిర్మించారు."అంగదాత స్మారక్"‌ నిర్మాణానికి జైపూర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన జంతర్‌ మంతర్‌  స్ఫూర్తి.  ‘‘ దేశంలో మొట్టమొదటిసారిగా అవయవదాతల స్మారక చిహ్నాన్ని మోహన్‌ ఫౌండేషన్‌– జైపూర్‌ సిటిజన్‌ ఫోరమ్‌ నవ్‌జీవన్‌ ఏర్పాటుచేసిందని తెలుసుకోవడం సంతోషంగా ఉంది.

జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా నవంబర్‌ 27, 2020వ తేదీన అంగదాత స్మారక్‌ను ఆవిష్కరించాం.  దీనిద్వారా సాహసవంతుల నిస్వార్థ చర్యకు తగిన గౌరవం అందించాలన్నది మా లక్ష్యం. వారు నిస్వార్థంగా తమ అవయవాలను అందించడంతో పాటుగా అవసరార్థులకు నూతన జీవితాన్నీ ప్రసాదించారు. ఈ మెమోరియల్‌ నిర్మాణం సైతం  ప్రజలకు స్ఫూర్తి కలిగించనుందని రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ అన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.