మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 16:47:13

నకిలీ మద్యం విషాదంపై న్యాయ ‌విచార‌ణ‌కు సీఎం ఆదేశం

నకిలీ మద్యం విషాదంపై న్యాయ ‌విచార‌ణ‌కు సీఎం ఆదేశం

చండీగ‌ఢ్ : ప‌ంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌, బ‌టాలా, టార్న్ త‌ర‌న్‌ జిల్లాల్లో క‌ల్తీ మ‌ద్యం సేవించి 21 మంది మృతిచెందిన ఘ‌ట‌న‌పై ఆ రాష్ర్ట సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ న్యాయ విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ విషయంపై జలంధర్ డివిజనల్ కమిషనర్ నేతృత్వంలోని మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. బటాలాలో నేడు మరో ఐదు మరణాలు సంభవించాయి. ఆస్ప‌త్రిలో చేరిన మ‌రో వ్య‌క్తి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.  టార్న్ తరన్ జిల్లాలో మరో నాలుగు మరణాలు సంభవించాయి.

ఈ విషాదానికి దారితీసిన ప‌రిస్థితుల‌ను, వాస్త‌వాల‌ను విచార‌ణ ప్యానెల్ ప‌రిశీలిస్తుంద‌ని అధికారిక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈ కేసులో దోషులుగా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పనిచేస్తున్న నకిలీ మద్యం తయారీ యూనిట్లను అరికట్టడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.logo