గురువారం 09 జూలై 2020
National - Jun 22, 2020 , 14:33:05

రాజస్థాన్‌లో 15వేలకు చేరువలో కరోనా కేసులు

రాజస్థాన్‌లో 15వేలకు చేరువలో కరోనా కేసులు

జైపూర్‌ : రాజస్థాన్‌లో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు 15వేలకు చేరువలో ఉన్నాయి. ఇప్పటి వరకు 14,997 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. సోమవారం కొత్తగా 67 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. జైపూర్‌లో 28, ధోల్‌పూర్‌ 10, అజ్మీర్‌ 6, జున్జును 6, కోట 6, దౌస 5, టోన్క్‌, సిరోహిలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు చెప్పారు. ఇందులో ముగ్గురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. కాగా, వైరస్‌ నుంచి 64 మంది కోలుకున్నారని, సోమవారం 66 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. కాగా, వైరస్‌తో ఇప్పటి వరకు 349 మంది మృతి చెందారు. 2,987 మంది యాక్టివ్ కేసులుండగా, 11,421 మంది డిశ్చార్జి అయినట్లు ఆరోగ్య శాఖ వివరించింది.


logo