ఆదివారం 05 జూలై 2020
National - Jun 18, 2020 , 17:55:19

చైనా ఫుడ్‌ని బహిష్కరించాలి

చైనా ఫుడ్‌ని బహిష్కరించాలి

న్యూఢిల్లీ : రెస్టారెంట్లు, హోటళ్లలో చైనా ఫుడ్‌ని బహిష్కరించాలని కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే పిలుపునిచ్చారు. చైనా ద్రోహం చేసే దేశం. చైనాలో తయారైన అన్ని ఉత్పత్తులను భారత్ బహిష్కరించాలి. చైనా ఆహారం.. భారతదేశంలో చైనీస్ ఆహారాన్ని విక్రయించే అన్ని రెస్టారెంట్లతో పాటు హోటళ్లను మూసివేయాలని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా అమరులైన సైనికులకు నివాళులర్పించారు. మీ త్యాగం వృథా కాదని, అమరులైన సైనికుల కుటుంబాలకు భారత ప్రభుత్వం, భారతీయులంతా అండగా నిలిచారు అని అథావాలే హిందీలో ట్వీట్ చేశారు. లడాఖ్‌ గాల్వాన్‌ వ్యాలీలో చైనా ఆర్మీ దాడిలో దేశ సైనికులు 20 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా చైనాకు వ్యతిరేకంగా ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతున్నాయి.


logo