గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 11:16:19

భూమిపూజ‌కు ముందే అద్వానీ, జోషిపై కేసును కొట్టేయండి : సుబ్ర‌మ‌ణ్య‌స్వామి

భూమిపూజ‌కు ముందే అద్వానీ, జోషిపై కేసును కొట్టేయండి : సుబ్ర‌మ‌ణ్య‌స్వామి

ఢిల్లీ : బీజేపీ సీనియ‌ర్ నేత‌లు లాల్ కృష్ణ అద్వానీ, ముర‌ళి మ‌నోహ‌ర్ జోషిపై న‌మోదైన బాబ్రీ మ‌సీదు కేసును కొట్టేయాల్సిందిగా బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి నేడు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని కోరారు. ట్విట్ట‌ర్ ద్వారా ఎంపీ స్పందిస్తూ... అయోధ్య‌లో రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ చేసేకంటే ముందే ఈ కేసును కొట్టేయాల్సింది ఆయ‌న ప్ర‌ధానికి విజ్ఞ‌ప్తి చేశారు. అద్వానీ, జోషి, ఇతర బీజేపీ నాయకులు ఈ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు కుట్ర చేసిన‌ట్లు అంటున్న‌ప్ప‌టికీ స‌ద‌రు నాయకులు మసీదును పడగొట్టలేదన్నారు. ఆల‌య పున‌ర్నిర్మానానికే ప‌నిచేసిన‌ట్లు వెల్ల‌డించారు. అద్వానీ, జోషి మొదలైనవారిని అయోధ్యకు తీసుకువెళ్లేకంటే ముందే బాబ్రీ మసీదు కూల్చివేత సిల్లీ కేసును మూసివేయాల్సిందిగా ప్ర‌ధాని ఆదేశించాల‌న్నారు. 

ఆగస్టు 5న అయోధ్యలో జ‌రిగే రామాల‌యం భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఆరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:10 గంటల వరకు పీఎం మోడీ అయోధ్యలో ఉంటారని స‌మాచారం. ఉద‌యం 8 గంట‌ల నుంచే రామ మందిరం భూమి పూజ‌కు సంబంధించిన ప్రార్థనలు, ఇత‌ర పూజా కార్య‌క్ర‌మాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 5 న మధ్యాహ్నం 12.15 గంటలకు రామాల‌య భూమి పూజ వేడుకను వారణాసికి చెందిన పండితులు నిర్వ‌హించ‌నున్నారు.


logo