శనివారం 31 అక్టోబర్ 2020
National - Aug 20, 2020 , 20:40:00

చేప‌లు ప‌ట్ట‌డానికి గాల‌మేస్తున్న ప‌క్షి.. మ‌నిషిని మించి పోయింది!

చేప‌లు ప‌ట్ట‌డానికి గాల‌మేస్తున్న ప‌క్షి.. మ‌నిషిని మించి పోయింది!

సాధార‌ణంగా చెరువు, స‌ర‌స్సుల్లోని చేప‌ల‌ను ప‌ట్టుకోవ‌డానికి మ‌నుషులు తెలివిగా గాల‌మేసి ప‌ట్టుకుంటారు. గాలానికి ఎర‌ను ఉప‌యోగించి చేప‌ల‌కు ఆశ చూపుతారు. ఎర‌ను అందుకోవడానికి వ‌చ్చి గాలంలో ఇరుక్కుంటాయి చేప‌లు. ఈ ప‌ద్ద‌తిని మ‌నుషులు ఉప‌యోగిస్తారు. కానీ ఇప్పుడు ప‌క్షులు కూడా ఉప‌యోగిస్తున్నాయి.

చేప‌లను ప‌ట్టుకోవ‌డానికి ప‌క్షి ఎర‌ను ఉప‌యోగించి గాల‌మేస్తున్న‌ది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. ఈ వీడియోను సైన్స్ నేచ‌ర్ హ‌బ్ ఖాతా పంచుకున్నారు. 'వీడియోకి ఒక ప‌దం' అనే శీర్షిక‌ను జోడించారు. 23 సెకండ్ల వీడియోలో ఒక ప‌క్షి నీటి అంచున కూర్చొని ఉంది. చేప‌ల కొసం ఎర‌గా ఉన్న చిన్న ఆహార క‌ణాన్ని నీటిలో ప‌డేసింది. ఆ ఎర‌ను తిన‌డానికి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన చేప‌ల‌ను ప‌క్షి అమాంతం లాగేసుకొని తినేస్తున్న‌ది. ఈ ప‌క్షి తెలివితేటల‌‌ను ఓ సారి మీరు కూడా చూసేయండి.