10th, 12th విద్యార్థులకు తరగతులు ప్రారంభం.. గదికి ఎందరంటే.?

రాజ్‌కోట్ : గుజరాత్ ప్రభుత్వం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 10, 12 విద్యార్థులకు తరగతులను పునః ప్రారంభించింది. కొవిడ్-19 వైరస్ నేపథ్యంలో 9 నెలలుగా పాఠశాలలు మూతబడిన పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. మాస్కులు, శానిటైజర్లు ఉన్నవారినే తరగతి గదిలోకి అనుమతించారు. రాజ్‌కోట్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థులను బ్యాచ్‌లుగా విడదీసి ఒక్కో తరగతికి కేవలం 10 మందిని మాత్రమే కూర్చోబెట్టారు.
భౌతికదూరం నిబంధన పక్కాగా అమలు చేసేందకే ఈ విధానం అనుసరించినట్లు ఆ పాఠశాల డైరెక్టర్ పేర్కొన్నారు. అహ్మాదాబాద్‌లో 10 నుంచి 15 బృందాలు ఆయా పాఠశాలలను తనిఖీ చేసి యాజమాన్యాలు కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నది లేనిది పరిశీలించారు. తరగతులకు హాజరయ్యే విద్యార్థులు విధిగా మాస్కులు ధరించాలని, చేతులు శానిటైజ్ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సూచించారు. యాజమన్యాలు కొవిడ్ నిబంధనలను తూ.చ. తప్పక అమలు చేయాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- పోలీసుల కవాతు పరిశీలన
- ఆపదలో షీటీమ్‌లను ఆశ్రయించాలి
- రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి: కలెక్టర్
- వాలీబాల్ C/O ఇనుగుర్తి
- సమస్యలు పరిష్కరిస్తా : జడ్పీ చైర్మన్
- అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
- సీసీ రోడ్డు పనులు ప్రారంభం
- ‘బాలికలు అద్భుతాలు సృష్టించాలి’
- బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం