సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 13:25:46

9 నుంచి 12 చ‌దివే విద్యార్థుల‌కు 23 నుంచి త‌ర‌గ‌తులు: ‌గుజ‌రాత్ విద్యామంత్రి

9 నుంచి 12 చ‌దివే విద్యార్థుల‌కు 23 నుంచి త‌ర‌గ‌తులు: ‌గుజ‌రాత్ విద్యామంత్రి

అహ్మ‌దాబాద్‌: కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాలు హ‌య్య‌ర్ సెకండ‌రీ పాఠ‌శాల‌ల‌ను ప్రారంభించగా, తాజాగా గుజ‌రాత్ కూడా అందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ది. మ‌రో రెండు వారాల్లో హ‌య్య‌ర్ సెకండ‌రీ స్కూళ్ల‌ను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. 9th-12th విద్యార్థుల‌కు ఈ నెల 23 నుంచి త‌ర‌గతులు మొద‌ల‌వుతాయ‌ని గుజ‌రాత్ విద్యాశాఖ మంత్రి భూపేంద్ర‌సింగ్ చుడాస‌మా తెలిపారు. అదేవిధంగా డిగ్రీ, పీజీ, ఇత‌ర వృత్తివిద్యా కోర్సుల్లో చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థుల‌కు కూడా న‌వంబ‌ర్ 23 నుంచే త‌ర‌గ‌తులు పునఃప్రారంభ‌మ‌వుతాయ‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూనే త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.