సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 12, 2020 , 02:07:57

ఆరేండ్లకే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌!

ఆరేండ్లకే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌!

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన అర్హం ఓం తల్సానియా వయస్సు ఆరేండ్లు. రెండో తరగతి చదువుతున్నాడు. ఫోన్లు, కంప్యూటర్లు అంటే ఎనలేని ఆసక్తి. దీంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న తండ్రి అర్హంకు ‘పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌' నేర్పించా డు. అర్హం వెంటనే నేర్చేసుకొని ‘మైక్రోసాఫ్ట్‌ సర్టిఫికేషన్‌' పరీక్షలో కూడా పాస్‌ అయ్యాడు. దీంతో ప్రపంచంలోనే పిన్న వయస్కుడైన ప్రోగ్రామర్‌గా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించాడు.