శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 21, 2020 , 07:24:55

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు

  • దరఖాస్తులకు ఆగస్టు 7వరకు గడువు

హైదరాబాద్‌ : దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న కేంద్రీయ విద్యాలయాల్లో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు తేదీ ఆగస్టు 7 వరకు ఉన్నది. కేంద్రీయ విద్యాలయాల్లో ఓబీసీలకు 27 శాతం సీట్లు కేటాయించారు. రెండో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే వారు జులై 20 నుంచి జులై 25వ తేదీ మధ్యలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకటో తరగతికి ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. పూర్తి వివరాలకు కేవీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌ kvsangathan.nic.in చూడొచ్చు. 


logo