బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 16:07:11

ఢిల్లీలో మ‌ళ్లీ హింస‌.. కేజ్రీవాల్ ఆందోళ‌న‌

ఢిల్లీలో మ‌ళ్లీ హింస‌..  కేజ్రీవాల్ ఆందోళ‌న‌

హైద‌రాబాద్‌:  ఢిల్లీలో ఇవాళ మ‌ళ్లీ హింస చెల‌రేగింది. రెండ‌వ రోజు కూడా దేశ‌రాజ‌ధాని భ‌గ్గుమ‌న్న‌ది.  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు మ‌ళ్లీ ఊపందుకున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని  భ‌జ‌న్‌పురా, మౌజ్‌పుర్‌, జ‌ఫ్రాబాద్ ప్రాంతాల్లో నిర‌స‌న‌లు హోరెత్తాయి.  సీఏఏ మ‌ద్ద‌తుదారులు, వ్య‌తిరేక‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణాత్మ‌క వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది.  రెండు వ‌ర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ద‌మ‌న‌కాండ‌లో ఓ ఆటోరిక్షా ధ్వంస‌మైంది. దానికి నిప్పు అంటించారు.  ఓ వ్య‌క్తి త‌న చేతిలో గ‌న్‌తో పోలీసు వైపు ప‌రుగులు తీస్తూ క‌నిపించాడు.   మౌజ్‌పుర వ‌ద్ద మెట్రో స్టేష‌న్‌ను దిగ్భందించారు. ఆదివారం జ‌ఫ్రాబాద్ వ‌ద్ద రాళ్లు రువ్విన సంఘ‌ట‌న జ‌రిగిన విష‌యం తెలిసిందే. సీఏఏకు వ్య‌తిరేకంగా అక్క‌డ‌ సుమారు వెయ్యి మంది మ‌హిళ‌లు ధ‌ర్నాలో పాల్గొన్నారు. ఇవాళ జ‌రిగిన సంఘ‌ట‌న ప‌ట్ల ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ స్పందించారు.  ఢిల్లీలో శాంతియుత వాతావ‌ర‌ణం లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  నిరుత్సాహ‌క‌ర వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ద‌న్నారు. న‌గ‌రంలో శాంతి నెల‌కొనే విధంగా భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర హోంశాఖ మంత్రిని సీఎం కోరారు.  


logo