బుధవారం 08 జూలై 2020
National - Jun 07, 2020 , 07:08:30

లాయర్లు, టోల్‌ప్లాజా సిబ్బంది మధ్య ఘర్షణ

లాయర్లు, టోల్‌ప్లాజా సిబ్బంది మధ్య ఘర్షణ

మధ్యప్రదేశ్‌ : లాయర్లు, టోల్‌ప్లాజా సిబ్బంది మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో ఇరువైపుల వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జబల్‌పూర్‌లోని బరీలా టోల్‌ప్లాజా వద్ద చోటుచేసుకుంది. బరీలా పోలీస్‌ స్టేషన్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ తెలిపిన వివరాల ప్రకారం... టోల్‌ప్లాజా వద్ద టికెట్ల జారీ విషయంలో లాయర్లు, టోల్‌ప్లాజా సిబ్బందికి మధ్య వివాదం తలెత్తింది.

వివాదం ముదిరి ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో పలువురు న్యాయవాదులు, టోల్‌ప్లాజా సిబ్బంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి ఘర్షణను నిలువరించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు.


logo