బుధవారం 20 జనవరి 2021
National - Jan 01, 2021 , 21:28:59

50 శాతం రైతు సమస్యలు పరిష్కరించారన్నది అబద్ధం: యోగేంద్ర యాదవ్

50 శాతం రైతు సమస్యలు పరిష్కరించారన్నది అబద్ధం: యోగేంద్ర యాదవ్

న్యూఢిల్లీ: రైతు సమస్యలు 50 శాతం పరిష్కారమైనట్లు కేంద్రం చెబుతున్న వాదనలు అబద్ధమని స్వరాజ్‌ ఇండియాకు చెందిన యోగేంద్ర యాదవ్ అన్నారు. మూడు వ్యవసాయ బిల్లుల రద్దు, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై చట్టపరమైన హామీ ఇవ్వాలన్న తమ రెండు ప్రధాన డిమాండ్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు. ఈ నెల 4న ప్రభుత్వంతో జరిగే తదుపరి రౌండ్ చర్చల్లో తమ డిమాండ్లను అంగీకరించకపోతే జనవరి 6 న కుండ్లి-మనేసర్-పాల్వాల్ (కెఎంపీ) వద్ద భారీ కవాతు నిర్వహిస్తామని తెలిపారు. షాజహాన్‌పూర్‌ సరిహద్దులోని రైతులు అక్కడి నుంచి ఎప్పుడు కదలాలి అన్నది త్వరలో నిర్ణయిస్తామని యోగేంద్ర యాదవ్ చెప్పారు.

మరోవైపు హర్యానాలో అన్ని టోల్ ప్లాజాలు ఉచితంగా ఉంటాయని, ప్రైవేటు మినహా అన్ని పెట్రోల్ పంపులు, మాల్స్‌ను మూసి వేస్తామని హర్యానా రైతు నాయకుడు వికాస్ సిసార్ తెలిపారు. బీజేపీ, జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) నాయకులు రాష్ట్రంలో నిరసనలను ఎదుర్కోవలసి ఉంటుందని, వారి కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం అయ్యే వరకు ఇది కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo