ఆదివారం 24 జనవరి 2021
National - Dec 24, 2020 , 15:32:44

కుతుబ్‌మినార్‌ ప్రాంతంలో ఆలయాలు ఉండేవి

కుతుబ్‌మినార్‌ ప్రాంతంలో ఆలయాలు ఉండేవి

న్యూఢిల్లీ : కుతుబ్ మినార్‌ ప్రాంగణంలోని హిందూ, జైన దేవాలయాల పునర్నిర్మాణం చేపట్టాలని, అలాగే సాధారణ ఆరాధన హక్కులను కల్పించాలన్న పిటిషన్‌పై ఢిల్లీలోని సాకేత్ కోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం కోరుతూ తదుపరి విచారణను కోర్టు మార్చి 6 కు వాయిదా వేసింది. ఈ కేసులో దరఖాస్తు చేసుకున్న ముగ్గురితో పాటు జైన తీర్థంకర రిషభదేవ్, విష్ణువులను పిటిషనర్‌ చేర్చారు.

మొఘల్ పాలకుడు కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో ఉన్న దేవాలయాలను పడగొట్టి  ఈ కట్టడాన్ని నిర్మించారని, దేవాలయాలను పూర్తిగా పడగొట్టలేకపోవడం వల్ల దానిలోని కొన్ని భాగాల్లోని గోడలు, స్తంభాలు, పైకప్పులు చిత్రాలు, హిందూ మత చిహ్నాలను కలిగి ఉన్నాయి. వీటిలో గణేశుడు, విష్ణు, యక్ష-యక్షిణి, ద్వారపాల్, పార్శ్వనాథ్, మహావీర, నటరాజ చిత్రాలు, మంగల్ కలాష్, శంఖం, జాపత్రి, శ్రీయంత్రం, గంటలు, కమలం చిహ్నాలు ఉన్నాయని పిటిషనర్‌ కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. కాంప్లెక్స్ 9 అంతర్గత, బాహ్య నిర్మాణాలు పురాతన హిందూ, జైన దేవాలయాల నిర్మాణానికి ప్రతీకగా ఉన్నాయని, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) సంక్షిప్త చరిత్రలో దేవాలయాల కూల్చివేత, కుతుబ్ మినార్‌లో మసీదుల నిర్మాణం గురించి కూడా ప్రస్తావించారని కోర్టుకు తెలిపారు. వివాదాస్పద స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించడం కూడా ముఖ్యమని, ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని కోరారు. మరమ్మతులు, నిర్మాణ పనులు, ఆరాధన ఏర్పాట్లు చేయడంలో కేంద్ర ప్రభుత్వం, ఏఎస్ఐ జోక్యం చేసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు కోర్టుకు విజ్ఞప్తి  చేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo