శనివారం 31 అక్టోబర్ 2020
National - Aug 20, 2020 , 13:47:36

సెప్టెంబ‌ర్ 7 త‌ర్వాతే సివిల్స్-2019 మార్కుల జాబితా

సెప్టెంబ‌ర్ 7 త‌ర్వాతే సివిల్స్-2019 మార్కుల జాబితా

ఢిల్లీ : సివిల్ సర్వీసెస్ పరీక్ష-2019 మార్కుల జాబితాను సెప్టెంబర్ 7వ తేదీ తర్వాత ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(యూపీఎస్‌సీ) నేడు తెలిపింది. ఈ నెల 4వ తేదీన సివిల్స్ ఫ‌లితాలు వెల్ల‌డైన సంగ‌తి తెలిసిందే. ఫ‌లితాల వెల్ల‌డి అనంత‌రం 15 రోజుల లోపు మార్కుల జాబితాను యూపీఎస్‌సీ ప్ర‌క‌టిస్తుంది. కాగా ఈ సారి ఆల‌స్యం అయింది.  2018 లో సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 5 న ప్రకటించబ‌డ్డాయి. ఇదే క్ర‌మంలో ఏప్రిల్ 12న మార్కుల జాబితాను ప్ర‌క‌టించారు. సివిల్స్ ఉద్యోగాల‌కు ఎంపికైన వారి, ఎంపిక‌కాని వారి అంద‌రి మార్కుల జాబితాను యూపీఎస్‌సీ విడుద‌ల చేయ‌నుది. సివిల్ సర్వీసెస్ పరీక్ష 2019 ఫ‌లితాల్లో ప్రదీప్ సింగ్ అగ్రస్థానంలో నిలిచారు. జతిన్ కిషోర్, ప్రతిభా వర్మ వరుసగా రెండో, మూడో స్థానంలో ఉన్నారు. మహిళా అభ్యర్థులలో వర్మ టాపర్‌గా ఉన్నారు.