సోమవారం 30 మార్చి 2020
National - Mar 27, 2020 , 14:05:09

లాక్ డౌన్ ఉందా..? అయితే నాకేంటి..వీడియో వైర‌ల్

లాక్ డౌన్ ఉందా..? అయితే నాకేంటి..వీడియో వైర‌ల్

కేర‌ళ‌తోపాటు దేశవ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ధాటికి లాక్ డౌన్ పాటిస్తోన్న విష‌యం తెలిసిందే. జ‌నాలంతా ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌వ‌డంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కేర‌ళ‌లో కూడా పోలీసులు, అధికారులు ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రాకుండా క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

అయితే ఇవేవి ప‌ట్ట‌న‌ట్టుగా ఒక‌రు రోడ్డుపైకి వ‌చ్చి..ద‌ర్జాగా పోలీసుల ముందునుంచి వెళ్లిపోయారు. ఇంత‌కీ వాళ్లెవ‌రు అనుకుంటున్నారా..?.అడ‌విలో నుంచి ఓ పునుగు పిల్లి కోజికోడ్ జిల్లాలో ద‌ర్శ‌న‌మిచ్చింది. లాక్ డౌన్ ఉందా..? అయితే నాకేంటి అన్న‌ట్లుగా పునుగు పిల్లి జీబ్రాక్రాసింగ్ దాటిన వీడియో సోష‌ల్‌మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుసంతా నందా షేర్ చేశారు. ఇలాంటి అరుదైన పునుగుపిల్లి దాదాపు 20 సంవ‌త్స‌రాల క్రితం క‌నిపించింద‌ట‌.logo