శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 03, 2020 , 14:43:17

సీఏఏపై యూఎన్ జోక్యం.. అంత‌ర్గ‌త వ్య‌వ‌హారమ‌న్న ప్ర‌భుత్వం

సీఏఏపై యూఎన్ జోక్యం.. అంత‌ర్గ‌త వ్య‌వ‌హారమ‌న్న ప్ర‌భుత్వం

హైద‌రాబాద్‌:  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం దేశ అంత‌ర్గ‌త వ్య‌వ‌హార‌మ‌ని, ఈ అంశంలో విదేశీ జోక్యాన్ని అంగీక‌రించేది లేద‌ని భార‌త ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.  సీఏఏపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు వ‌ద్ద ఐక్యరాజ్య‌స‌మితికి చెందిన మాన‌వ హ‌క్కుల‌ మండ‌లి పిటిష‌న్ వేసిన‌ట్లు తెలిసింది.  సీఏఏపై కొన‌సాగుతున్న కేసుల్లో త‌మ‌ను కూడా ఓ పార్టీగా స్వీక‌రించాల‌ని యూఎన్‌హెచ్ఆర్‌సీ అభ్య‌ర్థించింది. ఈ నేప‌థ్యంలో విదేశాంగ శాఖ ప్ర‌తినిధి రావీశ్ కుమార్ కొన్ని ట్వీట్స్ చేశారు.  భార‌త పార్ల‌మెంట్‌కు చ‌ట్టాలు చేసే సార్వ‌భౌమాధికారం ఉన్న‌ద‌న్నారు. ఇలాంటి అంశాల్లో విదేశీయులు జోక్యం క‌ల్పించేకునే అవ‌కాశం లేద‌న్నారు. సీఏఏకు రాజ్యాంగ నిబ‌ద్ధ‌త ఉంద‌న్నారు. రాజ్యాంగ విలువల ప్ర‌కార‌మే ఆ చ‌ట్టాన్ని రూపొందించామ‌న్నారు.   భార‌త్ ప్ర‌జాస్వామ్య దేశ‌మ‌ని, చ‌ట్టం ప్ర‌కారం న‌డుస్తుంద‌ని, దేశ న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం ఉంద‌ని, సుప్రీంకోర్టు కూడా ఇదే తీర్పునిస్తుంద‌ని విశ్వాసంతో ఉన్న‌ట్లు రావీశ్ కుమార్ తెలిపారు.  


logo