ఆదివారం 05 జూలై 2020
National - Jun 29, 2020 , 14:19:07

2 కి.మీ. దాటి వెళ్లొద్దు.. ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

2 కి.మీ. దాటి వెళ్లొద్దు.. ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

ముంబై : మ‌హారాష్ర్ట రాజ‌ధాని ముంబైలో క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తోంది. చాప‌కింద నీరులా క‌రోనా విస్త‌రిస్తుండ‌టంతో.. ముంబై వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో క‌రోనా క‌ట్ట‌డికి ముంబై పోలీసులు ప‌కడ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

లాక్ డౌన్ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ముంబై పౌరులు త‌మ నివాస ప్రాంతాల నుంచి 2 కిలోమీట‌ర్లు దాటి వెళ్లొద్ద‌ని పోలీసులు ఆదేశించారు.కేవ‌లం మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ, ఉద్యోగుల‌కు మాత్ర‌మే 2 కి.మీ. దాటి వెళ్లేందుకు అనుమ‌తి ఉంద‌న్నారు.  

ఒక వేళ ఈ నిబంధ‌న ఉల్లంఘింస్తే అలాంటి వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. వాహ‌నాల‌ను కూడా సీజ్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి వ్య‌క్తి విధిగా మాస్కు ధ‌రించాలి. భౌతిక దూరం పాటించి.. క‌రోనాను క‌ట్ట‌డి చేయాల‌ని పోలీసులు విజ్ఞ‌ప్తి చేశారు. మాస్కులు ధ‌రించ‌కుండా, భౌతిక దూరం పాటించ‌క‌పోతే.. వారి ప్రాణాల‌కు ముప్పు తెచ్చుకున్న‌ట్లే అని చెప్పారు. 

లాక్ డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 19,638 మంది నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డంతో.. వారిపై 10,731 కేసులు న‌మోదు అయ్యాయి. శ‌నివారం వ‌ర‌కు 11,751 మందిని అరెస్టు చేశారు. 6,826 వాహ‌నాల‌ను ముంబై పోలీసులు సీజ్ చేశారు. 


logo