గురువారం 13 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 07:08:03

సోషల్‌ మీడియా వినియోగంపై సిబ్బందికి సీఐఎస్‌ఎఫ్‌ మార్గదర్శకాలు!

సోషల్‌ మీడియా వినియోగంపై సిబ్బందికి సీఐఎస్‌ఎఫ్‌ మార్గదర్శకాలు!

న్యూఢిల్లీ: ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల వినియోగంపై భారత పారిశ్రామిక భద్రతా బలగం (సీఐఎస్‌ఎఫ్‌) తన 1.62 లక్షల మంది సిబ్బందికి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిని ఉల్లంఘించిన వారు తీవ్రమైన, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

సోషల్‌ మీడియా వేదికల వల్ల జాతీయ భద్రతకు, బలగాల సాధారణ క్రమశిక్షణకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు జారీచేసినట్లు సీఐఎస్‌ఎఫ్‌ వెల్లడించింది. సిబ్బంది తాము పనిచేస్తున్న విభాగాలు, యూనిట్ల ద్వారా మాత్రమే యూజర్‌ఐడీలను బహిర్గతం చేయాలన్నది. ఒకవేళ యూజర్‌ ఐడీ మార్చుకోవాలన్నా, కొత్త ఐడీలను సృష్టించాలన్నా సంబంధిత విభాగానికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo