గురువారం 04 జూన్ 2020
National - May 08, 2020 , 16:11:15

కరోనాతో సీఐఎస్‌ఎఫ్‌ అధికారి మృతి

కరోనాతో సీఐఎస్‌ఎఫ్‌ అధికారి మృతి

న్యూఢిల్లీ : సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌)కు చెందిన ఓ అధికారి కరోనా వైరస్‌తో కోల్‌కతాలో మృతి చెందారు. సీఐఎస్‌ఎఫ్‌ విభాగంలో ఇప్పటికే కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కోల్‌కోతాలో మృతి చెందిన అధికారిని అసిత్‌ కుమార్‌ షాగా పోలీసులు గుర్తించారు. కలకత్తా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అసిత్‌ కన్నుమూసినట్లు పోలీసులు తెలిపారు. అసిత్‌తో సన్నిహితంగా మెలిగిన మరో 50 మంది సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు పోలీసులు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఇండియన్‌ మ్యూజియం వద్ద అసిస్టెంబ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు స్థాయిలో అసిత్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు వద్ద విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ అధికారి గురువారం కరోనాతో మృతి చెందిన విషయం విదితమే. 


logo