సోమవారం 01 జూన్ 2020
National - May 12, 2020 , 12:07:44

క‌రోనాతో సీఐఎస్ఎఫ్ ఏఎస్ఐ మృతి

క‌రోనాతో సీఐఎస్ఎఫ్ ఏఎస్ఐ మృతి

కోల్‌క‌తా:  క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ నేప‌థ్యంలో స్థానిక పోలీస్ ఫోర్స్ స‌రిపోక‌ భ‌ద్ర‌తా బ‌లగాల్లోని అన్ని విభాగాల‌ను కేంద్రం లాక్‌డౌన్ విధుల్లో నియ‌మించింది. అయితే, దేశంలో క‌రోనా క‌ట్ట‌డి కోసం ముందుండి పోరాడుతున్న వీరిలో కొంద‌రిని ఆ మహ‌మ్మారిని క‌బ‌లిస్తున్న‌ది. ఇప్ప‌టికే బీఎస్ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ త‌దిత‌ర విభాగాల‌కు చెందిన భ‌ద్ర‌తాసిబ్బందిలో చాలా మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలో విధులు నిర్వ‌హిస్తున్న‌ సీఐఎస్ఎఫ్ ఏఎస్ఐకి ఇటీవ‌ల‌ క‌రోనా పాజిటివ్‌గా తేలింది. అయితే, ప‌రిస్థితి విష‌మించ‌డంతో సోమ‌వారం రాత్రి ఆయ‌న‌ ప్రాణాలు కోల్పోయాడు. ‌

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo