బుధవారం 27 జనవరి 2021
National - Dec 03, 2020 , 15:40:52

స్కూళ్ల పునరుద్ధరణపై సీఎంలకు సీఐఎస్‌సీఈ లేఖ

స్కూళ్ల పునరుద్ధరణపై సీఎంలకు సీఐఎస్‌సీఈ లేఖ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐఎస్‌సీ, ఐసీఎస్‌ఈ బోర్డు పరీక్షలు నిర్వహించే కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్స్‌ (సీఐఎస్‌సీఈ) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు లేఖ రాసింది. పది, 12వ తరగతి విద్యార్థులు ప్రాజెక్టు వర్క్స్‌, ప్రాక్టికల్‌ వర్క్స్‌లో పాల్గొనడంతోపాటు పాఠ్యాంశాల్లో సందేహాల నివృత్తి కోసం జనవరి 4 నుంచి పాక్షికంగా స్కూళ్లను పునరుద్ధరించాలని కోరింది. దీని కోసం ప్రభుత్వం జారీ చేసిన అన్ని కొవిడ్‌ 19 మార్గదర్శకాలను పాటిస్తామని తెలిపింది. అలాగే రాష్ట్రాల అసెంబ్లీలకు ఏప్రిల్‌-మే మధ్యలో జరిగే ఎన్నికల తేదీలను తెలియజేయాలని భారత ఎన్నికల సంఘాన్ని కోరింది. దీంతో 2001 ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ బోర్డు పరీక్షల తేదీలను ఖరారు చేస్తామని తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo