గురువారం 28 మే 2020
National - May 22, 2020 , 15:26:39

CISCE పెండింగ్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

CISCE పెండింగ్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ: కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామ్స్‌ (CISCE) బోర్డు 10, 12వ తరగతి పెండింగ్‌ పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది. 2020, జూలై 2 నుంచి 12 వరకు 10వ తరగతి పరీక్షలు, 2020, జూలై 1 నుంచి 14 వరకు 12వ తరగతి పరీక్షలు జరుగుతాయని బోర్డు ప్రకటించింది.

10 తరగతి పరీక్షలు జూలై 2, 4, 6, 8, 10, 12 తేదీల్లో జరుగుతాయి. అన్ని పరీక్షలు ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఒంటి గంటలకు ముగుస్తాయి. అప్లయిడ్‌ ఆర్ట్‌, టెక్నికల్‌ డ్రాయింగ్‌, హిందీ పరీక్షలు మాత్రం ఉదయం 11 గంటలకు మొదలై మధ్యా రెండు గంటలకు ముగుస్తాయి. ఇక 12వ తరగతి పరీక్షలు జూలై 1, 3, 5, 7, 9, 11, 13, 14 తేదీల్లో జరుగుతాయి. అన్ని పరీక్షలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరుగుతాయి.  logo