సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 04, 2020 , 18:57:47

మ‌హారాష్ట్ర‌లో రేప‌ట్నుంచి సినిమాహాళ్లు ప్రారంభం

మ‌హారాష్ట్ర‌లో రేప‌ట్నుంచి సినిమాహాళ్లు ప్రారంభం

ముంబై: క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ కార‌ణంగా దేశంలో దాదాపు ఏడు నెల‌లుగా సినిమాహాళ్లు మూత‌ప‌డ్డాయి. ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం పూర్తిగా త‌గ్గ‌న‌ప్ప‌టికీ కొత్త‌గా న‌మోద‌య్యే రోజువారి కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింది. దీంతో కేంద్రం లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇస్తూ వ‌చ్చింది. అన్‌లాక్‌-5లో భాగంగా 20 రోజుల క్రితం నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసిన కేంద్రం సినిమా హాళ్ల‌ను కూడా తెరుచుకునేందుకు రాష్ట్రాల‌కు అవ‌కాశం ఇచ్చింది. 

కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు సినిమాహాళ్ల‌ను ప్రారంభించాయి. వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న మ‌హారాష్ట్ర మాత్రం ఇప్ప‌టికే సినిమాహాళ్ల‌ను మూసే ఉంచింది. ఈ క్ర‌మంలో రేప‌టి నుంచి రాష్ట్రంలో సినిమా హాళ్ల‌ను పునఃప్రారంభించేందుకు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తించింది. సినిమాహాళ్లు, థియేట‌ర్‌లు, మ‌ల్టీప్లెక్సుల‌ను 50 శాతం కెపాసిటీకి మించ‌కుండా ఈ నెల 5 నుంచి తెరుచుకోవ‌చ్చ‌ని తెలిపింది. అయితే, కంటైన్‌మెంట్ జోన్‌ల‌లో సినిమాహాళ్లు, మ‌ల్టీప్లెక్సుల‌పై మాత్రం ఎప్పటిలాగే నిషేధం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టంచేసింది.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.