మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 12:55:06

అక్టోబ‌ర్ 1 నుంచి సినిమా హాల్స్ ఓపెన్!

అక్టోబ‌ర్ 1 నుంచి సినిమా హాల్స్ ఓపెన్!

న్యూఢిల్లీ : క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా సినిమా హాల్స్ మూత‌ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే అన్‌లాక్ 5.0లో భాగంగా సినిమా హాల్స్ ఓపెన్‌కు కేంద్రం అనుమ‌తిచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి మేర‌కు సెప్టెంబ‌ర్ 21వ తేదీ నుంచి ఓపెన్-ఎయిర్ థియేటర్లకు కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మొత్తానికి సినిమా హాల్స్ కూడా అక్టోబ‌ర్ 1 నుంచి తెరుచుకోనున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అక్టోబ‌ర్ 1 నుంచి థియేట‌ర్ల‌ను తెరిచేందుకు ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. కేంద్రం అన్‌లాక్ 5.0 మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేస్తే కానీ.. సినిమా థియేట‌ర్ల ఓపెన్‌పై స్ప‌ష్ట‌త రాదు. అయితే సినిమా హాల్స్‌లో త‌ప్ప‌నిస‌రిగా కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. గ‌తం మాదిరి కాకుండా సీటు విడిచి సీటులో కూర్చునేలా ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అన్‌లాక్ 4.0 సెప్టెంబ‌ర్ 30తో ముగియ‌నుంది. ఇప్ప‌టికే మెట్రో స‌ర్వీసులు ప్రారంభ‌మ‌య్యాయి. 9-12 త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తిచ్చింది. 


logo