బుధవారం 27 జనవరి 2021
National - Jan 01, 2021 , 17:33:27

నేటి నుంచి సినిమాహాళ్ల‌కు అనుమ‌తి.. ఎక్క‌డో తెలుసా..?

నేటి నుంచి సినిమాహాళ్ల‌కు అనుమ‌తి.. ఎక్క‌డో తెలుసా..?

భువ‌నేశ్వ‌ర్‌: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో ఒడిశాలో గ‌త‌ తొమ్మిది నెల‌లుగా మూత‌ప‌డ్డ సినిమాహాళ్ల‌ను ఈ రోజు నుంచి తెరుచుకునేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం అనుమ‌తించింది. అయితే ప్ర‌భుత్వం అనుమ‌తించినా అక్క‌డ సినిమా థియేట‌ర్లు మాత్రం ఇప్పుడ‌ప్పుడే తెరుచుకునే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. ఇప్ప‌టికిప్పుడు సినిమా టాకీస్‌ల‌ను ర‌న్ చేయ‌డానికి అవ‌స‌ర‌మైన కంటెంట్ ఏదీ లేద‌ని, అందువ‌ల్ల ఈ రోజు థియేట‌ర్ల‌ను తెరిచే ప‌రిస్థితి లేద‌ని ఒడిశా సినిమా థియేట‌ర్ నిర్వాహ‌కుల‌ యూనియ‌న్ ఛైర్మ‌న్ పేర్కొన్నారు. అయినా, అన్ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుని, కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ త్వ‌ర‌లోనే థియేట‌ర్లను తెరుస్తామ‌ని చెప్పారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo