బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 16:54:17

కేరళలో సినిమా థియేటర్ల మూసివేత

కేరళలో సినిమా థియేటర్ల మూసివేత

తిరువనంతపురం : కేరళలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం పినరయి విజయన్‌ అధ్యక్షతన ఇవాళ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. జనాలు రద్దీగా ఉండే ప్రాంతాలపై దృష్టి సారించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మార్చి 31వ తేదీ వరకు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్ణయించారు. పెళ్లిళ్లకు కూడా దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫంక్షన్లతో పాటు ఇతర కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని సీఎం చెప్పారు. కేరళలో ఆరుగురికి కరోనా వైరస్‌ ఉన్నట్లు తేలింది. మొత్తంగా కేరళలో 12 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక ప్రైమరీ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. 


logo