మంగళవారం 04 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 17:22:57

అయోధ్య లో రామాలయం నిర్మాణంపై చిరాగ్ పాస్వాన్ కీలక వ్యాఖ్యలు

అయోధ్య లో రామాలయం నిర్మాణంపై చిరాగ్ పాస్వాన్ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ : అయోధ్య రామ జన్మ భూమిలో రామాలయం నిర్మాణంపై చిరాగ్ పాస్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "తాను చాలా అదృష్టవంతుడినని, తాను జీవించి ఉన్న కాలంలోనే అయోధ్య రామ జన్మ భూమిలో రామాలయం నిర్మాణం జరుగుతుండడం తన అదృష్టమని" లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఈ నెల 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రామాలయానికి భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పాశ్వాన్ ఆదివారం ట్విటర్ వేదికగా అయోధ్య రామ జన్మ భూమిలో రామాలయం నిర్మాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు."

తాను గొప్ప రామ భక్తురాలి వంశానికి చెందినవాడినని , అనేక సంవత్సరాల తర్వాత అయోధ్యలో భగవాన్ శ్రీరాముని దేవాలయం నిర్మితమవుతున్నదని, రామాలయం నిర్మాణం కేవలం మానవులకే కాకుండా, అన్ని జీవులు, జంతువులు, పశువులు, పక్షులకు సైతం సంతోషకరమని, ఆత్మ సంతృప్తి కలిగించే విషయమని పేర్కొన్నారు. శ్రీరాముడిని దేశం, జాతి వంటి వాటికే పరిమితం చేయడం సరికాదని , శ్రీరాముడు సకల జీవకోటికి దారి చూపే దేవుడని ఆయన పేర్కొన్నారు.

నిమ్నవర్గాల నుంచి వచ్చిన మాతంగ మహర్షి శిష్యురాలు శబరి అని తెలిపారు. మాత శబరికి అనేక సద్గుణాలు ఉన్నాయని, అయినా ఆమెకు అహంకారం లేదని " చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. మాత శబరికి అహంకారం లేకపోవడం వల్లే ఆమె స్వయంగా కొరికి, ఇచ్చిన పండ్లను శ్రీరాముడు స్వీకరించాడన్నారు. శ్రీరాముడు శబరిని తన తల్లి కౌసల్యతో సమానమని చెప్పారని , అటువంటి శబరి వంశస్తుఢినైన తాను తన కండ్ల ఎదుట రామాలయం నిర్మాణం జరుగుతుండటాన్ని చూడటం తన అదృష్టం గా భావిస్తున్నానని "చిరాగ్ పాశ్వాన్ అన్నారు


logo