మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 22, 2020 , 21:12:43

నితీశ్‌ జంప్‌ కావచ్చు.. మోదీజీ జాగ్రత్త!

నితీశ్‌ జంప్‌ కావచ్చు.. మోదీజీ జాగ్రత్త!

పాట్నా: బీహార్‌ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ ఎన్నికల తర్వాత జంప్‌ కావచ్చు అని ఎల్జేపీ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ ఆరోపించారు. మెదీజీ జాగ్రత్తగా ఉండాలంటూ పరోక్షంగా సూచించారు. నితీశ్‌ కుమార్‌పై చిరాగ్‌ మరోసారి విమర్శలు సంధించారు. ‘గత ఎన్నికల్లో లాలూ ప్రసాద్‌ ఆశీసులతో గౌరవనీయులైన నితీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం ఆయనను మోసగించి ప్రధాని మోదీ ఆశీసులతో సీఎం పదవిని కాపాడుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మెదీ ఆశీసులు తీసుకుంటున్నారు. ఆ తర్వాత లాలూ ప్రసాద్‌ శిబిరానికి చేరితే ఏం చేస్తారు?’ అని హిందీలో ట్వీట్‌ చేశారు.

అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పుట్టిన రోజు సందర్భంగా చిరాగ్‌ గురువారం ప్రత్యేకంగా ట్విట్టర్‌లో అభినందనలు తెలిపి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన ఆయన ఎన్నికల అనంతరం బీహార్‌లో బీజేపీ, ఎల్జీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని పదే పదే చెబుతున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.