బుధవారం 21 అక్టోబర్ 2020
National - Sep 17, 2020 , 15:51:24

పంజాబీ సాంగ్స్‌తో హోరెత్తిస్తున్న చైనా సైనికులు

పంజాబీ సాంగ్స్‌తో హోరెత్తిస్తున్న చైనా సైనికులు

న్యూఢిల్లీ: చైనా మరో కొత్త ఎత్తుగడకు తెరతీసింది. లఢక్ సరిహద్దులో పంజాబీ సాంగ్స్‌తో ఆ దేశ సైనికులు హోరెత్తించారు. గురువారం లౌడ్ స్పీకర్లలో పంజాబీ సాంగ్స్‌ను ప్లే చేశారు. ఫింగర్ 4 వద్ద ఎత్తైన వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించిన భారత్ సైన్యం దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించారు. తద్వారా సైకలాజికల్ యుద్ధ తంత్రానికి చైనా సైన్యం ప్రయత్నించింది. అయితే ఆ దేశ ఆర్మీ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. 1962 యుద్ధం సందర్భంలోనూ చైనా ఇలాంటి కుయుక్తులు పన్నింది. బాలీవుడ్, హిందీ సాగ్స్‌ను ప్లే చేసింది. తద్వారా తమకు భారతీయ భాషలు తెలుసనేలా వ్యవహరించింది. తాజాగా మరోసారి అలాంటి ట్రిక్‌నే చైనా ప్రయోగించింది. గురువారం సరిహద్దుల్లో పంజాబీ సాంగ్స్ ప్లే చేసింది. తద్వారా మీరు మాట్లాడుకునే విషయాలన్నీ మాకు తెలుసన్నట్లుగా బిల్డప్ ఇచ్చింది.

భారత ఆర్మీలో ఎక్కువగా హిందీ, పంజాబీ భాషలో మాట్లాడుతుంటారు. సరిహద్దులో ఉన్నప్పుడు హిందీ, పంజాబీ పాటలు పాడుతుంటారు. చైనా సైనికులకు దీని గురించి తెలుసు. అందుకే ప్రస్తుతం వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉన్న భారత దళాల దృష్టిని మరల్చేందుకు చైనా సైనికులు పంజాబీ సాంగ్స్ ప్లే చేసి ప్రయత్నించారు. భారత్, చైనా సరిహద్దులో గత 45 ఏండ్లుగా ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు. అయితే ఇటీవల ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత 20 రోజుల్లో మూడుసార్లు కాల్పుల ఘటనలు జరిగాయి. దీంతో సరిహద్దులో అత్యంత అప్రమత్తంగా ఉన్న భారత్ బలగాల దృష్టిని మరల్చేందుకు చైనా సైనికులు లౌడ్ స్పీకర్లలో పంజాబీ సాంగ్స్ ప్లే చేసినట్లు సమాచారం.
లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo