బుధవారం 08 జూలై 2020
National - Jun 21, 2020 , 02:09:21

గల్వాన్‌లో చైనా సైనికుల దాడులు పక్కా ప్లాన్‌ ప్రకారమే

గల్వాన్‌లో చైనా సైనికుల దాడులు పక్కా ప్లాన్‌ ప్రకారమే

  • నదీ ప్రవాహం అడ్డగింత 
  • భారత జవాన్లు వెళ్లగానే నీరు విడుదల 
  • నియంత్రణ కోల్పోయిన సైనికులపై పాశవిక దాడి 

న్యూఢిల్లీ: గల్వాన్‌లో చైనా సైనికుల దాడులు పక్కా ప్లాన్‌ ప్రకారమే జరిగాయని సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ‘గల్వాన్‌ నదీ ప్రవాహాన్ని ముందస్తుగా అడ్డుకున్నాయి. భారత సైనికులు జూన్‌ 15న ఘటనాస్థలికి చేరుకోగానే అడ్డుకట్టను తొలిగించాయి. నీటి ప్రవాహం వల్ల సైనికులు నియంత్రణ కోల్పోయారు. మరికొంతమందిని చైనా బలగాలు నీటిలోకి తోసేశాయి’ అని ఆయన వివరించారు. ఘర్షణలకు ముందే డ్రోన్లతో చైనా దళాలు భారత భూభాగాల్లో నిఘాను కొనసాగించాయని, భారత బలగాల సామర్థ్యాన్ని అంచనా వేసుకున్నాక, వారి బలగాల్ని ఎల్‌ఏసీకి అటువైపునకు మోహరించాయని చెప్పారు. తోపులాట, ఘర్షణల కంటే ముందే చైనా దళాలు హెల్మెట్లు ధరించి మేకులతో చుట్టిన కర్రలతో భారత సైన్యంపై దాడికి పాల్పడ్డాయన్నారు. 


logo