మంగళవారం 26 జనవరి 2021
National - Jan 11, 2021 , 12:37:09

చైనా జ‌వాన్‌ను అప్ప‌గించిన భార‌త్‌

చైనా జ‌వాన్‌ను అప్ప‌గించిన భార‌త్‌

న్యూఢిల్లీ : భార‌త భూభాగంలోకి వ‌చ్చిన చైనా జవాన్‌ను ఆ దేశ సైన్యానికి ఇండియ‌న్ ఆర్మీ ఇవాళ తిరిగి అప్ప‌గించింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 8వ తేదీన పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికుడు ల‌ఢాక్‌లోని ఎల్ఏసీ వ‌ద్ద స‌రిహ‌ద్దు దాటి భార‌త భూభాగంలోకి వ‌చ్చాడు. అప్ర‌మత్త‌మైన భార‌త బ‌ల‌గాలు ఆ సైనికుడిని అదుపులోకి తీసుకున్నాయి. అయితే త‌మ సైనికుడు అదృశ్య‌మైన‌ట్టు చైనా ఆర్మీ శ‌నివారం ప్ర‌క‌టించింది. ఆ త‌ర్వాత త‌మ భూభాగ ప‌రిధిలోకి వ‌చ్చినందున ఆ సైనికుడిని అదుపులోకి తీసుకున్న‌ట్లు ఇండియ‌న్ ఆర్మీ ప్ర‌క‌టించింది. మొత్తంగా ఇవాళ ఉద‌యం 10:10 గంట‌ల‌కు స‌రిహ‌ద్దులోని చూషుల్ - మోల్దో వ‌ద్ద సైనికుడిని చైనా సైన్యానికి భార‌త బ‌ల‌గాలు అప్ప‌గించాయి. గాల్వ‌న్ ఘ‌ర్ష‌ణ‌ల తర్వాత‌ పీఎల్ఏ సైనికులు భార‌త భూభాగ ప‌రిధిలోకి రావ‌డం ఇది రెండోసారి. గ‌తేడాది అక్టోబ‌ర్‌లో కూడా పీఎల్ఏ సైనికుడు ల‌ఢాక్ వ‌ద్ద భార‌త భూభాగంలోకి ప్ర‌వేశించాడు. 


logo