మంగళవారం 19 జనవరి 2021
National - Oct 21, 2020 , 10:10:33

చైనా సైనికుడిని అప్ప‌గించిన భార‌త ఆర్మీ

చైనా సైనికుడిని అప్ప‌గించిన భార‌త ఆర్మీ

హైద‌రాబాద్‌: భార‌త భూభాగంలోకి అనుకోకుండా చొర‌బ‌డ్డ చైనా సైనికుడిని మంగ‌ళ‌వారం రాత్రి భార‌త ఆర్మీ ద‌ళాలు ఆ దేశానికి అప్ప‌గించాయి. కార్పోర‌ల్ వాంగ్ యా లాండ్ అనే పీఎల్ఏ సైనికుడు రెండు రోజుల క్రితం అక్ర‌మంగా వాస్త‌వాధీన రేఖ దాటి వ‌చ్చాడు.  అత‌న్ని చుమార్ డెమ్‌చోక్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్న‌ట్లు సోమ‌వారం ఆర్మీ చెప్పిన విష‌యం తెలిసిందే.  పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీకి అప్ప‌గించ‌డానికి ముందు చైనా నిపుణులు ఆ సైనికుడిని ప్ర‌శ్నించినట్లు తెలుస్తోంది.  భార‌త ఆర్మీ ర్యాంక్‌లో నాయ‌క్‌తో స‌మానంగా చైనా ఆర్మీలో కార్పోర‌ల్‌ను పోలుస్తారు.  ఓ స్థానిక జంతు కాప‌రికి స‌హాయం చేస్తూ అక్టోబ‌ర్ 18వ తేదీ సాయంత్రం త‌మ సైనికుడొక‌రు అదృశ్య‌మైనట్లు పీఎల్ఏ వెస్ట్ర‌న్ థియేట‌ర్ క‌మాండ్ ప్ర‌తినిధి తెలిపారు.  భార‌త ద‌ళాల‌కు చిక్కిన చైనా జ‌వానుకు వైద్యం సాయం అందించారు.  ఆక్సిజ‌న్‌; ఆహారం, వెచ్చ‌ని దుస్తులు ఇచ్చారు.  జూన్ 15వ తేదీన గాల్వ‌న్ లోయ‌లో ఘ‌ర్ష‌ణ జ‌రిగిన త‌ర్వాత ఇరు దేశాల మ‌ధ్య వాతావ‌ర‌ణం ఉద్రిక్తంగా మారిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్ప‌టికే ప‌లు ద‌శ‌ల్లో రెండు దేశాల సైనికులు, దౌత్య అధికారుల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి.  తాజాగా మ‌రో సారి కార్ప్స్ క‌మాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది.