గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 20:24:17

చేప‌లు తిని కాలేయం పోగొట్టుకున్న వ్య‌క్తి.. అస‌లు విష‌యం తెలిస్తే షాక‌వుతారు!

చేప‌లు తిని కాలేయం పోగొట్టుకున్న వ్య‌క్తి.. అస‌లు విష‌యం తెలిస్తే షాక‌వుతారు!

చేప‌లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. క‌రోనా టైంలో చేప కూర ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిసిన సంగ‌తే.. కానీ ఇత‌ను చేప‌లు తిని కాలేయం స‌మ‌స్య‌కు గుర‌య్యాడు . అదేంటని వైద్యులు ఆరాతీయ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఇంత‌కీ  ఏం జ‌రిగిందంటే.. చైనాలోని హ్యాంగ్జౌ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి గత నాలుగు రోజులుగా విరేచనాలు, అలసట, కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఇటీవల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో అతడు హస్పిటల్‌కు వెళ్లాడు. అతడి కాలేయాన్ని పరిశీలించిన వైద్యులు.. ఆశ్చర్యపోయారు.

కాలేయం స‌గం మాత్రమే ఉంది. 19 సెం.మీ. పొడ‌వు మాత్ర‌మే ఉంది. దాని ప‌క్క‌నే 18 సెం.మీ. వెడల్పు ఉన్న చీము గడ్డ కనిపించింది. దాని చుట్టు ఇత‌ర గ‌డ్డ‌లు కూడా ఏర్ప‌డ‌టం మొద‌లైంది. ఇక ఆల‌స్యం అయితే ప్రాణానికే ప్ర‌మాదం అని చికిత్స మొద‌లుపెట్టారు. అస‌లు ఈ స‌మ‌స్య ఎందుకు వ‌చ్చింద‌ని, అత‌ను తినే ఆహారం గురించి వ్య‌క్తిని ఆరా తీశారు. అత‌ను రోజూ  చేపలను ఉడక బెట్టకుండా పచ్చిగా తింటానని తెలిపాడు. దీంతో అస‌లు విష‌యం అర్థ‌మైంది. చేప‌లో ఉండే పరాన్నజీవులు, బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అవి శరీరంలోనే గుడ్లు పెట్టి తమ సంతానాన్ని పెంచుకుంటూ మ‌నిషి శ‌రీరాన్ని పూర్తిగా నాశ‌నం చేస్తుంది. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎన్ని జ‌రిగినా చైనా వాళ్ల‌కి బుద్ధి మాత్రం రాదు.


 

తాజావార్తలు


logo