మంగళవారం 14 జూలై 2020
National - Jun 22, 2020 , 14:28:08

భారత జవాన్ల దెబ్బకు భయపడ్డ చైనా సైన్యం

భారత జవాన్ల దెబ్బకు భయపడ్డ చైనా సైన్యం

న్యూఢిల్లీ : గల్వాన్‌ ఘనటలో 20 మంది జవాన్లు వీరమరణం పొందారని తెలిశాక భారత సైన్యం చైనా సైనికులపై ప్రతిదాడి చేసింది. దీంతో ఆ దేశ సైన్యం భయపడి తమ భూ భాగంలోకి పరుగులు తీసింది. ఈ క్రమంలో వారిని వెంబడిస్తూ వెళ్లిన భారత సైనికులు 10 మంది చైనా సైనికులకు బందీలుగా చిక్కారు. ఈ ఘటన భారత సైనికుల ధైర్య సాహసాలను తెయజేస్తుందని సైన్యం ఉన్నాతాధికారులు అన్నారు. ఇటీవల చైనా చెర నుంచి విడుదలైన భారత జవాన్లకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు.

రెండు రోజులకు పైగానే చైనా సైనికలు చెరలో బందీలుగా ఉనా.. వారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని తెలిసింది. భారత సైన్యం ప్రతి దాడి చేస్తుందని చైనా ఊహించలేదని, మనం ఒకేసారి దాడి చేయడంతో వారు బయపడి పారిపోయారని విడుదలైన వారు తెలిపారు. ఇప్పటి వరకు చైనా పెద్ద యుద్ధాలు చేయలేదని, ఇప్పటికిప్పుడు యుద్ధ చేయాల్సి వస్తే ఎంచేయాలో కూడా వారికి తెలియదన్నారు.


logo