శనివారం 04 జూలై 2020
National - Jun 17, 2020 , 09:31:00

సైనికుల్ని బ‌లితీసుక‌ున్న పాయింట్ 14..

సైనికుల్ని బ‌లితీసుక‌ున్న పాయింట్ 14..

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ లోయ‌లో పెట్రోలింగ్ పాయింట్ 14 వ‌ద్ద  చైనా సైనికులు ఏర్పాటు చేసిన టెంట్ వ‌ల్లే.. ల‌డ‌ఖ్ లోయ‌లో ర‌క్త‌పాతానికి కార‌ణ‌మైన‌ట్లు ప్రాథ‌మికంగా తెలుస్తోంది.  చైనా బ‌ల‌గాలతో సోమవారం రాత్రి జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో.. సుమారు 20 మంది భార‌తీయ సైనికులు వీర‌మ‌ర‌ణం పొందారు.  అయితే ఆ ఘ‌ర్ష‌ణ‌కు పాయింట్ 14 వ‌ద్ద ఉన్న టెంట్ కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.  గాల్వ‌న్ న‌ది స‌మీపంలో ఉన్న ఈ టెంట్‌ను తీసివేయాల‌ని భార‌తీయ సైనికులు చైనాను హెచ్చ‌రించారు. కానీ పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీకి చెందిన సైనికులు భార‌త ఆదేశాల‌ను బేఖాత‌రు చేశారు. క‌మాండింగ్ ఆఫీస‌ర్ క‌ల్న‌ల్ సంతోశ్ బాబు నేతృత్వంలోని 16 బీహార్ రెజిమెంట్‌.. పాయింట్ 14 వ‌ద్ద ఉన్న చైనా టెంట్ వ‌ర‌కు వెళ్లారు.   

వ్యుహాత్మ‌క‌మైన ప్రాంతం

భార‌త స‌రిహ‌ద్దుకు చెందిన‌ వాస్త‌వాధీన రేఖ లోప‌ల చైనా సైనికులు ఆ టెంట్‌ను వేశారు.  పెట్రోలింగ్ ప‌రంగా అది వ్యుహాత్మ‌క‌మైన ప్ర‌దేశం. పాయింట్ 14 వ‌ద్ద‌కు వెళ్లిన భార‌తీయ సైనికుల‌పై .. చైనా ఆర్మీ దాడి చేసిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా తెలుస్తున్న‌ది. అత్యంత ఎత్తులో ఉన్న చైనా సైనికులు.. భార‌త ఆర్మీపై రాళ్ల‌తో దాడి చేశారు.  ఆ త‌ర్వాత ఇనుప క‌డ్డీలు, క్ల‌బ్స్‌తో భార‌త ఆర్మీపై కిరాత‌కంగా దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది.  వాస్త‌వానికి రెండు దేశాల‌కు చెందిన సైనికులు ఈ ఘ‌ర్ష‌ణ‌లో ప్రాణాలు కోల్పోయారు. క్రిటిక‌ల్‌గా ఉన్న వారిని మిలిట‌రీ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. 

కర్నల్ మృతిపై విచారణ

గాల్వ‌న్‌, ష‌యోక్ న‌దుల స‌మ్మేళ‌నం వ‌ద్ద పాయింట్ 14 ఉంది. ఇక్క‌డే గ‌త వారం డివిజ‌న్ క‌మాండ‌ర్ స్థాయి స‌మావేశాలు జ‌రిగాయి. త‌మ ద‌ళాల‌ను త‌గ్గించేందుకు రెండు దేశాలు ఆ స‌మావేశంలో అంగీక‌రించాయి.  ఉద్రిక్త‌త‌లు త‌గ్గించే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న స‌మ‌యంలో .. భారీ ర‌క్త‌పాతం ఎందుకు జ‌రిగింద‌న్న దానిపై క్లారిటీ లేదు.  క‌ర్నల్ సంతోశ్‌బాబు ఎలా మ‌ర‌ణించాడ‌న్న కోణంలోనూ సునిశ్చిత స్థాయి విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. పీఎల్ఏ ద‌ళాలు ఘ‌ర్ష‌ణ స‌మ‌యంలో.. క‌ల్న‌ల్‌ను టార్గెట్ చేసి ఉంటార‌ని మిలిట‌రీ అధికారులు అనుమానిస్తున్నారు.  భార‌త‌, చైనా ప్ర‌భుత్వాలు మాత్రం అధికారికంగా ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. 

ఇటీవ‌ల ష‌యాక్ న‌దిపై భార‌త ఓ బ్రిడ్జ్‌ను నిర్మించింది. దాన్ని వ్య‌తిరేకిస్తూ పీఎల్ఏ ద‌ళాలు.. పాయింట్ 14 వ‌ద్ద టెంట్ వేసి తిష్ట వేశాయి. ఇటీవ‌ల జ‌రిగిన చ‌ర్చ‌ల త‌ర్వాత పీఎల్ఏ ద‌ళాలు.. అక్క‌డ ఉన్న రెండు టెంట్ల‌ను తొల‌గించాయి.  ఆ త‌ర్వాత పాయింట్ 15 వ‌ద్ద కూడా చైనా ఆర్మీ ఓ టెంట్‌ను ఫిక్స్ చేసింది. దీంతో ఆ ప్రాంతంలో మ‌న సైనికులు కూడా గ‌స్తీని పెంచారు. గాల్వ‌న్ వ్యాలీలోని పాయింట్ 17 వ‌ద్ద కూడా సైనిక ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న‌ది. ఈ ప్ర‌దేశానికి రెండు దేశాలు త‌మ ఆయుధాల‌ను, బ‌ల‌గాల‌ను మోహ‌రించాయి. కానీ ఓ ఒప్పందం ప్ర‌కారం ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించారు.   logo