బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Sep 12, 2020 , 19:07:10

చైనా ఉప‌గ్ర‌హ ప్ర‌యోగం విఫ‌లం

చైనా ఉప‌గ్ర‌హ ప్ర‌యోగం విఫ‌లం

బీజింగ్‌: చైనా ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన రాకెట్ ప్ర‌యోగం విఫ‌ల‌మైంది. చైనా అంత‌రిక్ష పరిశోధ‌న సంస్థ శ‌నివారం మ‌ధ్యాహ్నం 01:02 గంట‌ల‌కు జిలిన్‌-1 గావోఫెన్ 02సీ ఉప‌గ్ర‌హాన్ని క్వాయ్‌జౌ-1ఏ రాకెట్ ద్వారా అంత‌రిక్షంలోకి పంపించారు. చైనా వాయ‌వ్య ప్రాంతంలోని ఉప‌గ్ర‌హ ప్ర‌యోగ కేంద్రం నుంచి ఈ ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగించారు. అయితే, విజ‌య‌వంతంగా అంత‌రిక్షంలోకి దూసుకెళ్లిన రాకెట్ నిర్ణీత క‌క్ష్య‌ను చేరుకోవ‌డంలో మాత్రం విఫ‌ల‌మైంది. కాగా, రాకెట్ నింగిలోకి ఎగుర‌గానే దానిలోని సాంకేతిక లోపాల‌ను గుర్తించామ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. ప్ర‌యోగం విఫ‌ల‌మ‌వ‌డానికిగ‌ల కార‌ణాలపై విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని చెప్పారు.                                  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo