గురువారం 09 జూలై 2020
National - Jun 18, 2020 , 10:08:31

చైనాది అర్థంలేని వాద‌న: భార‌త్‌

చైనాది అర్థంలేని వాద‌న:  భార‌త్‌

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ లోయ త‌మదే అని చైనా చేసిన వాద‌న‌లను భార‌త్ తీవ్రంగా ఖండించింది. చైనా చేస్తున్న ఆరోప‌ణ‌లు.. అతిగా ఉన్నాయ‌ని, నిర్ధార‌ణ‌కు వీలు కాని విధంగా అర్థ‌ర‌హితంగా డ్రాగ‌న్ దేశం ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు భార‌త్ పేర్కొన్న‌ది.  ఈస్ట్ర‌న్ ల‌డఖ్‌లోని గాల్వ‌న్ వ్యాలీలో.. సోమ‌వారం రాత్రి భార‌త‌, చైనా బ‌ల‌గాల మ‌ధ్య హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన చైనా.. గాల్వ‌న్ లోయ‌లోని భూభాగం త‌మ‌దే అన్న వాద‌న వినిపించింది.  ఈ వ్యాఖ్య‌ల‌ను భార‌త విదేశాంగ శాఖ ప్ర‌తినిధి అనురాగ్ శ్రీవాత్స‌వ తీవ్రంగా ఖండించారు. 

గాల్వ‌న్ అంశ‌పై విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌.. చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడిన‌ట్లు అనురాగ్ శ్రీవాత్స‌వ తెలిపారు.  గాల్వ‌న్‌లో ప‌రిస్థితిని బాధ్య‌తాయుతంగా ప‌రిష్క‌రించాల‌ని రెండు దేశాలు అంగీక‌రించాయి. జూన్ 6వ తేదీన సీనియ‌ర్ క‌మాండ‌ర్ల స్థాయిలో కుదిరిన అవ‌గాహ‌న‌ల‌ను అమ‌లు చేయాల‌ని రెండు దేశాలు నిర్ణ‌యించిన‌ట్లు అనురాగ్ తెలిపారు. గాల్వ‌న్ వ్యాలీలో జ‌రిగిన అసాధార‌ణ ఘ‌ట‌న వ‌ల్ల రెండు దేశాల సంబంధాలు దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉన్న‌ట్లు చైనాతో భార‌త్ పేర్కొన్న‌ది.  ముంద‌స్తు ప్లాన్ ప్ర‌కార‌మే చైనా దాడికి దిగిన‌ట్లు భార‌త విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. 

logo