మంగళవారం 14 జూలై 2020
National - Jun 17, 2020 , 14:29:55

చైనా చర్యలే ఘర్షణకు కారణం : భారత విదేశాంగ శాఖ

చైనా చర్యలే ఘర్షణకు కారణం : భారత విదేశాంగ శాఖ

గాల్వన్‌ లోయలో హింసాత్మక ఘటనకు చైనా బలగాల చర్యలే కారణమని భారత విదేశాంగ శాఖ తెలిపింది. చైనా కవ్వింపు చర్యలతో ఘర్షణ చోటు చేసుకుందని విదేశాంగ శాఖ పేర్కొంది. చైనా బలగాలు ఒక్కసారిగా తమ స్టాండ్‌ మార్చుకొని ఏకపక్షంగా వ్యవహరించడంతోనే ఘర్షణ ప్రారంభమైందని తెలిపింది. సరిహద్దులో ఇరుదేశాల ఉన్నాతాధికారుల సమక్షంలో కుదిరిన ఒప్పందాన్ని పక్కన పెట్టి చైనా ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే హింసాత్మక ఘటన చోటు చేసుకుందని, ఇరు వైపుల ప్రాణనష్టం జరిగిందని పేర్కొంది.

భారత్‌ స్పష్టమైన విధానంతో ఉంది. సరిహద్దులో చేపట్టిన చర్యలన్నీ భారత భూ భాగంలోనే కొనసాగుతున్నాయి. నిబంధనలు అతిక్రమించలేదు. చైనా వైపు నుంచి కూడా దీన్నే ఆశిస్తున్నాం అని విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీవాస్తవ పేర్కొన్నారు.logo