బుధవారం 27 జనవరి 2021
National - Jan 12, 2021 , 10:27:43

10వేల మంది సైనికుల‌ను ఉప‌సంహ‌రించిన చైనా..

10వేల మంది సైనికుల‌ను ఉప‌సంహ‌రించిన చైనా..

న్యూఢిల్లీ: వాస్త‌వాధీన రేఖ వెంట ఉన్న కీల‌క ప్రాంతాల నుంచి ప‌ది వేల మంది సైనిక ద‌ళాల‌ను చైనా ఉప‌సంహ‌రించిన‌ట్లు తెలుస్తోంది.  కానీ ఫ్రంట్‌లైన్ ద‌ళాల‌ను మాత్రం ఆ దేశం వెన‌క్కి పంప‌డంలేదు.  వాస్తవాధీన రేఖ వెంట ఉన్న మ‌న ద‌ళాల‌ను మాత్రం ఉప‌సంహ‌రించేదిలేద‌ని భార‌త్ పేర్కొన్న‌ది.  ఈస్ట్ర‌న్ ల‌డాఖ్‌లో ఉన్న స‌రిహ‌ద్దుల్లో గ‌త కొన్నాళ్లుగా ఉద్రిక్త‌త నెల‌కొన్న విష‌యం తెలిసిందే.  వ్యూహాత్మ‌కంగా కీల‌కమైన ప్ర‌దేశాల నుంచి చైనా త‌మ ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించిన‌ట్లు ఓ నివేదిక ద్వారా వెల్ల‌డైంది. అయితే స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల నుంచి చైనా త‌మ సైన్యాన్ని వెన‌క్కి పంప‌లేదు. సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్‌,  ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ భ‌దౌరియాలు సోమ‌వారం రోజున ల‌డాఖ్‌లో ప‌ర్య‌టించారు.  ఎల్ఏసీ వెంబ‌డి బ‌ల‌గాల‌ను త‌గ్గించే ప్ర‌సక్తే లేద‌ని వాళ్లు పేర్కొన్నారు.  స‌రిహ‌ద్దు వెంట ఎళ్ల‌వేళ‌లా సంసిద్ధంగా ఉంటామ‌న్నారు. చైనా కొంత వ‌ర‌కు త‌మ బ‌ల‌గాల‌ను వెన‌క్కి పంపినా.. ఇంకా అనేక ఘ‌ర్ష‌ణాత్మ‌క ప్రాంతాల్లో రెండు దేశాల సైనికులు మోహ‌రించిన‌ట్లు భార‌త ఆర్మీ వెల్ల‌డించింది.  ప్ర‌స్తుతం క‌ఠిన‌మైన శీతాకాల వాతావ‌ర‌ణంలో వ‌ల్ల చైనా త‌మ ద‌ళాల‌ను వెన‌క్కి పంపి ఉంటుంద‌ని అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.  మ‌ళ్లీ వాతావ‌ర‌ణం వేడెక్క‌గానే ఆ సైనికులు య‌ధాస్థితికి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.


logo