బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 16:24:41

భద్ర‌తా కార‌ణాల దృష్ట్యా యాప్‌ల‌ను నిషేధించాం.. చైనాకు చెప్పిన భార‌త్‌

భద్ర‌తా కార‌ణాల దృష్ట్యా యాప్‌ల‌ను నిషేధించాం.. చైనాకు చెప్పిన భార‌త్‌

హైద‌రాబాద్‌: కొన్ని రోజుల క్రితం చైనాకు చెందిన 59 ర‌కాల యాప్‌ల‌పై  భార‌త ప్ర‌భుత్వం నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. దీనిపై డ్రాగ‌న్ దేశం భార‌త్‌ను ప్ర‌శ్నించిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన దౌత్య అధికారుల స‌ద‌స్సులో ఈ స‌మ‌స్య చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే చైనా అధికారులకు భార‌త్ క్లారిటీ ఇచ్చిన‌ట్లు కూడా తెలుస్తోంది. భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా 59 యాప్‌ల‌ను బ్యాన్ చేసిన‌ట్లు భార‌త్ ఆ దేశానికి స్ప‌ష్టం చేసింది. త‌మ పౌరుల డేటా చోరీ కాకుండా ఉండేందుకు ఆ చ‌ర్య తీసుకున్న‌ట్లు భార‌త్ వివ‌రించింది. చైనాతో జ‌రిగిన ద్వైపాక్షిక భేటీలో ఈ అంశంపై చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.  టిక్‌టాక్‌, వీచాట్‌, హెలో లాంటి యాప్‌ల‌ను భార‌త్ బ్యాన్ చేసింది. యూజ‌ర్స్ నుంచి డేటా సేక‌రిస్తున్న ఆ యాప్స్‌.. దాన్ని ఇత‌ర దేశాల‌కు చేర‌వేస్తున్న‌ట్లు జూన్ 29వ రోజున కేంద్రం ఆరోపించింది. ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 69ఏ ప్ర‌కారం చైనా యాప్‌ల‌పై నిషేధం విధించారు.  గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో.. డ్రాగ‌న్ దేశానికి చెందిన మొబైల్ యాప్‌ల‌పై భార‌త్ నిషేధం ప్ర‌క‌టించింది.


logo