శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 26, 2020 , 07:51:38

క‌శ్మీర్‌కు భారీగా ఆయుధాలు పంపండి.. ఐఎస్ఐకి చైనా ఆదేశం

క‌శ్మీర్‌కు భారీగా ఆయుధాలు పంపండి.. ఐఎస్ఐకి చైనా ఆదేశం

న్యూఢిల్లీ: స‌రిహ‌ద్దుల్లో సైనికుల‌ను మోహ‌రించి ల‌ఢ‌క్‌, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి చైనా అనునిత్యం అల‌జ‌డి సృష్టిస్తూనే ఉన్న‌ది. తాజాగా జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌ను అధికం చేయ‌డానికి కుయుక్తులు ప‌న్నుతున్న‌ది. ఇందులోభాగంగా జమ్ముకశ్మీర్ లోయ‌లోకి పెద్ద ఎత్తున ఆయుధాలను, మందుగుండు సామగ్రిని పంపించాలని పాకిస్తాన్ గూఢ‌చార‌సంస్థ ఐఎస్‌ఐకి స్పష్టం చేసినట్లు తెలుస్తున్న‌ది. భారత వ్యతిరేక శక్తులు ఉగ్ర చర్యలకు పాల్పడేందుకు మరింత సాయమందించాలని సూచించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

ఇటీవల భ‌ద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాలపై చైనా తయారీ మార్కింగ్స్‌ ఉన్నట్లు గుర్తించారు. జ‌మ్ముక‌శ్మీర్‌ను కేంద్ర‌పాలిత ప్రాంతంగా చేసిన త‌ర్వాత ప్ర‌భుత్వం ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌ను అడ్డుకోవ‌డంపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా చొరబాట్లకు వీల్లేకుండా భ‌ద్ర‌తాబ‌ల‌గాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులను కానీ, ఆయుధాలను కానీ కశ్మీర్లోకి పంపించడం పాకిస్తాన్‌కు క‌ష్టంగా మారింది. అయితే దాంతో పరిస్థితుల్లో శీతాకాలం మొద‌ల‌య్యేనాటికి సాధ్యమైనంతవ‌ర‌కు ఉగ్రవాదులను, ఆయుధాలను లోయలోకి పంపించాలని ఐఎస్‌ఐ భావిస్తున్న‌ద‌ని నిఘావ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ క్ర‌మంలో స‌రిహ‌ద్దుల్లో డ్రోన్ల‌ద్వారా, పైపుల్లో ఆయుధాలను అక్ర‌మంగా చేర‌వేస్తున్న‌ది.