ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 19:52:33

చైనా ఆన్ లైన్ బెట్టింగ్... భారత యువతే లక్ష్యం

చైనా ఆన్ లైన్ బెట్టింగ్... భారత యువతే లక్ష్యం

హైదరాబాద్: ఆన్ లైన్ బెట్టింగ్ పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు రూ . 1100 కోట్లకు పైగా ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడినట్టు చెబుతున్నారు. పోకో పేరుతో ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్న చైనా కంపెనీ పై దాడులు నిర్వహించగా  ఈ చీకటి దందా వెలుగులోనికి వచ్చింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసులో చైనా వ్యక్తితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ముఠా పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించినట్టు తెలిసింది. భారత దేశం లోని యువతను లక్ష్యం చేసుకొని ఈ చైనా ఆన్ లైన్ గేమ్స్ ద్వారా మోసం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రూ .1100 కోట్ల వరకు ఈ గేమ్స్ ద్వారా లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.  పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


logo