ఆదివారం 12 జూలై 2020
National - Jun 18, 2020 , 07:41:58

చైనాను దోషిగా నిలబెట్టాలి

చైనాను దోషిగా నిలబెట్టాలి

న్యూఢిల్లీ: లఢక్‌లోని గల్వాన్‌ లోయలో భారత జవాన్లపై దాడులకు పాల్పడి వారి మరణానికి కారణమైన చైనాపై యావత్‌ జాతి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన ఆ దేశానికి భారత్‌ ఏ విధంగా సమాధానం చెబుతుందోనన్న చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సైన్యంతో ప్రతిదాడికి పోవడంకంటే అంతర్జాతీయ సమాజం ముందు చైనాను దోషిగా నిలబెట్టడంపైనే భారత్‌ దృష్టి సారించనున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

దీంతోపాటు ఈ ఏడాది జరుగాల్సిన భారత్‌-చైనా 70వ వార్షిక సమావేశాలను కూడా భారత్‌ రద్దుచేసే అవకాశమున్నది. ఇప్పటికే చైనా వైఖరిని ఎండగడుతున్న పశ్చిమ దేశాలు తాజా ఘటనలతో భారత్‌కు మరింత చేరువయ్యే అవకాశం కూడా ఉన్నది.


logo