బుధవారం 12 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 07:33:14

లిపు‌లేఖ్‌ సమీ‌పంలో చైనా సైన్యం!

లిపు‌లేఖ్‌ సమీ‌పంలో చైనా సైన్యం!

న్యూఢిల్లీ: తూర్పు లఢ‌క్‌లో దుశ్చ‌ర్య‌లకు పాల్పడి 20 మంది భారత జవా‌న్లను పొట్ట‌న‌బె‌ట్టు‌కున్న చైనా మరో దుస్సా‌హ‌సా‌నికి ఒడి‌గ‌ట్టింది. ఉత్త‌రా‌ఖం‌డ్‌‌లోని లిపు‌లేఖ్‌ పాస్‌ సమీ‌పం‌లోకి తమ సైన్యా‌న్ని పంపిం‌చిం‌దని భారత సైనిక వర్గాలు తెలి‌పాయి. లిపు‌లేఖ్‌ సరి‌హ‌ద్దు‌లకు కొంచం దూరంలో దాదాపు వెయ్యి‌మంది చైనా సైని‌కులు ఉన్నట్టు పేర్కొ‌న్నాయి. ‘ఎ‌ల్‌‌ఏసీ వెంబడి పరి‌స్థి‌తులు ఇంకా ఉద్రి‌క్తం‌గానే ఉన్నాయి. ఎల్‌‌ఏ‌సీకి తన‌వై‌పున ఉన్న భూభా‌గాల్లో చైనా మౌలిక సదు‌పా‌యా‌లను ఏర్పాటు చేసు‌కుం‌టు‌న్నది’ అని ఆర్మీ అధి‌కారి ఒకరు వెల్ల‌డిం‌చారు. 

కాగా, నేపాల్‌, చైనా మధ్య ద్వైపా‌క్షిక సంబం‌ధాలు వృద్ధి చెందేం‌దుకు మరింత కృషి చేస్తా‌మని చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌‌పింగ్‌ తెలి‌పారు. చైనా–‌నే‌పాల్‌ ద్వైపా‌క్షిక సంబం‌ధాల 65వ వార్షి‌కో‌త్స‌వాలు ఇరు‌దే‌శాల్లో ఘనంగా జరు‌గు‌తు‌న్నాయి. ఈ నేప‌థ్యంలో నేపాల్‌ అధ్య‌క్షు‌రాలు బిద్యా‌దే‌వికి జిన్‌‌పింగ్‌ సందే‌శాన్ని పంపారు.


logo