సోమవారం 30 నవంబర్ 2020
National - Jul 15, 2020 , 00:45:07

చైనా లేజర్‌ ఆయుధం!

చైనా లేజర్‌ ఆయుధం!

  • రోదసిలోని భారత్‌, అమెరికా ఉపగ్రహాలను ధ్వంసం చేయగల సామర్థ్యం

న్యూఢిల్లీ: శత్రుదేశాలకు చెందిన శాటిలైట్లను ధ్వంసం చేయగల లేజర్‌ ఆయుధాలను చైనా సమకూర్చుకున్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధ సమయాల్లో చైనా ఈ లేజర్‌ వెపన్‌ల ద్వారా భారత్‌, అమెరికాకు చెందిన శాటిలైట్లను నాశనం చేయగలదని పేర్కొంటున్నారు. అమెరికా రక్షణ విభాగానికి చెందిన డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (డీఐఏ).. అంతరిక్ష ముప్పులకు సంబంధించి గతేడాది జనవరిలో ఒక నివేదికను విడుదల చేసింది. లో- ఎర్త్‌ ఆర్బిట్‌లోని శాటిలైట్లను ధ్వంసం చేయగల లేజర్‌ వెపన్‌ను వచ్చే ఏడాది(2020) కల్లా చైనా మోహరించే అవకాశమున్నదని అందులో డీఐఏ హెచ్చరించింది. అలాంటి ఒక లేజర్‌ స్టేషన్‌ జింజియాంగ్‌లో ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. అందులో నాలుగు భవనాలు ఉన్నట్లు తెలిపారు. ఒకదాంట్లో శాటిలైట్‌ ట్రాకింగ్‌ వ్యవస్థలు ఉండగా, మిగిలిన మూడు భవనాలను శాటిలైట్‌ సెన్సర్లను ధ్వంసం చేసేందుకు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.